200 లక్ష్యం.. వికెట్‌ కోల్పోకుండా

కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (110 నాటౌట్‌; 66 బంతుల్లో 11×4, 5×6) మెరుపు సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్‌తో ఏడు టీ20ల సిరీస్‌ను ఆతిథ్య పాకిస్థాన్‌ 1-1తో సమం చేసింది. గురువారం రెండో టీ20లో పాక్‌ 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది.

Published : 23 Sep 2022 02:55 IST

బాబర్‌ మెరుపు శతకం

పాక్‌దే రెండో టీ20

కరాచి: కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (110 నాటౌట్‌; 66 బంతుల్లో 11×4, 5×6) మెరుపు సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్‌తో ఏడు టీ20ల సిరీస్‌ను ఆతిథ్య పాకిస్థాన్‌ 1-1తో సమం చేసింది. గురువారం రెండో టీ20లో పాక్‌ 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్‌ మొయిన్‌ అలీ (55 నాటౌట్‌; 23 బంతుల్లో 4×4, 4×6), డకెట్‌ (43; 22 బంతుల్లో 7×4), బ్రూక్‌ (31; 19 బంతుల్లో 1×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 19.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా అందుకుంది. బాబర్‌ సెంచరీకి తోడు మహ్మద్‌ రిజ్వాన్‌ (88 నాటౌట్‌; 51 బంతుల్లో 5×4, 4×6) చెలరేగాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts