విజృంభించిన శార్దూల్, సేన్‌

న్యూజిలాండ్‌-ఏతో ఇప్పటికే అనధికార టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్‌-ఏ.. మూడు వన్డేల సిరీస్‌లోనూ ఘనంగా బోణీ కొట్టింది. పేసర్లు శార్దూల్‌ ఠాకూర్‌ (4/32), కుల్‌దీప్‌ సేన్‌ (3/30)

Published : 23 Sep 2022 02:55 IST

భారత్‌-ఏ బోణీ

చెన్నై: న్యూజిలాండ్‌-ఏతో ఇప్పటికే అనధికార టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్‌-ఏ.. మూడు వన్డేల సిరీస్‌లోనూ ఘనంగా బోణీ కొట్టింది. పేసర్లు శార్దూల్‌ ఠాకూర్‌ (4/32), కుల్‌దీప్‌ సేన్‌ (3/30) విజృంభించడంతో గురువారం జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో కివీస్‌-ఏను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌-ఏను శార్దూల్, కుల్‌దీప్‌ దెబ్బ తీశారు. 40.2 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్‌ చేశారు. రిప్పన్‌ (61; 104 బంతుల్లో 4×4), వాకర్‌ (36; 49 బంతుల్లో 3×4, 1×6) పోరాడకపోతే ఆ జట్టు ఆ మాత్రం స్కోరు కూడా చేయలేకపోయేది. లక్ష్యాన్ని భారత్‌ 31.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్‌ పృథ్వీ షా (17) త్వరగా ఔటైనా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (41; 54 బంతుల్లో 3×4, 2×6), రాహుల్‌ త్రిపాఠి (31; 40 బంతుల్లో 4×4) జట్టును విజయపథంలో నడిపించారు. వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా.. రజత్‌ పాటిదార్‌ (45 నాటౌట్‌; 41 బంతుల్లో 7×4), కెప్టెన్‌ సంజు శాంసన్‌ (29 నాటౌట్‌; 32 బంతుల్లో 1×4, 3×6) నాలుగో వికెట్‌కు 69 పరుగులు జత చేసి భారత్‌ను గెలిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని