ఇంద్రజిత్‌ శతకం

బాబా ఇంద్రజిత్‌ (118; 125 బంతుల్లో 14×4) సెంచరీ సాధించడంతో వెస్ట్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. గురువారం, రెండోరోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో

Published : 23 Sep 2022 02:55 IST

సౌత్‌జోన్‌ 318/7

కొయంబత్తూర్‌: బాబా ఇంద్రజిత్‌ (118; 125 బంతుల్లో 14×4) సెంచరీ సాధించడంతో వెస్ట్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. గురువారం, రెండోరోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 318 పరుగులు చేసింది. ఒక దశలో సౌత్‌జోన్‌ 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో మొదట కెప్టెన్‌ విహారి (25).. ఆ తర్వాత మనీష్‌ పాండే (48) జతగా ఇంద్రజిత్‌ సౌత్‌జోన్‌ను మెరుగైన స్థితిలో నిలబెట్టాడు. శతకం తర్వాత ఇంద్రజిత్‌ వెనుదిరిగినా.. కృష్ణప్ప గౌతమ్‌ (43), రవితేజ (26 బ్యాటింగ్‌) స్కోరు 300 దాటించారు. ఆట చివరికి రవితేజ, సాయికిశోర్‌ (6 నాటౌట్‌)తో కలిసి క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతానికి సౌత్‌జోన్‌ 48 పరుగుల ఆధిక్యంలో ఉంది. వెస్ట్‌జోన్‌ బౌలర్లలో జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ (3/52), అతీత్‌ సేథ్‌ (3/51) రాణించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 250/8తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్ట్‌జోన్‌ 270 పరుగులకు ఆలౌటైంది. హిత్‌ పటేల్‌ (98; 189 బంతుల్లో 6×4, 1×6) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సాయికిశోర్‌ (5/86), బాసిల్‌ థంపి (2/42), స్టీఫెన్‌ (2/52) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని