ఇదో భిన్నమైన అనుభవం

కెరీర్‌ చివరి టోర్నమెంట్లో రఫెల్‌ నాదల్‌ జతగా ఆడబోతుండడం భిన్నమైన అనుభవమని స్విస్‌ మాస్టర్‌ రోజర్‌ ఫెదరర్‌ అన్నాడు. లేవర్‌ కప్‌తో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న రోజర్‌.. శుక్రవారం నాదల్‌తో కలిసి డబుల్స్‌ మ్యాచ్‌ (కెరీర్‌లో చివరిది)

Published : 23 Sep 2022 02:57 IST

లండన్‌: కెరీర్‌ చివరి టోర్నమెంట్లో రఫెల్‌ నాదల్‌ జతగా ఆడబోతుండడం భిన్నమైన అనుభవమని స్విస్‌ మాస్టర్‌ రోజర్‌ ఫెదరర్‌ అన్నాడు. లేవర్‌ కప్‌తో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న రోజర్‌.. శుక్రవారం నాదల్‌తో కలిసి డబుల్స్‌ మ్యాచ్‌ (కెరీర్‌లో చివరిది) ఆడనున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘నాదల్‌ నా ప్రత్యర్థిగా కాకుండా నా జోడీగా ఆడబోతుండడం చాలా ఆనందంగా ఉంది. రఫాతో మరోసారి జట్టుగా దిగడం భిన్నమైన అనుభూతిగా మిగలబోతోంది. శాయశక్తులా రాణించేందుకు ప్రయత్నిస్తా’’ అని రోజర్‌ చెప్పాడు. చిరస్మరణీయమైన మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు నాదల్‌ తెలిపాడు. ‘‘రోజర్‌తో ఆడే మ్యాచ్‌ ఎప్పటికీ గుర్తు పెట్టుకునేది. నా కెరీర్‌లో కీలకమైన సందర్భమిది. కాస్త కష్టంగా ఉన్నా.. ఫెదరర్‌తో ఆడే మ్యాచ్‌ ఆసక్తిని రేపుతోంది’’ అని రఫా పేర్కొన్నాడు. టీమ్‌ యూరోప్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెదరర్, నాదల్‌.. అమెరికా ఆటగాళ్లు ఫ్రాన్సిస్‌ తియాఫో, జాక్‌ సాక్‌లతో తలపడనున్నారు. గతేడాది వింబుల్డన్‌ క్వార్టర్‌ఫైనల్లో హ్యుబర్ట్‌ హర్కాజ్‌తో ఆడిన తర్వాత 41 ఏళ్ల ఫెదరర్‌ మళ్లీ టెన్నిస్‌ కోర్టులోకి రావడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని