క్వార్టర్స్‌లో అర్జున్, ప్రజ్ఞానంద

జులియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో భారత టేనేజీ సంచలనాలు అర్జున్‌ ఇరిగేశి, ప్రజ్ఞానంద క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. ప్రిలిమినరీ దశలో 19 ఏళ్ల తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ రెండు, 17 ఏళ్ల తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద

Published : 23 Sep 2022 02:57 IST

న్యూయార్క్‌: జులియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో భారత టేనేజీ సంచలనాలు అర్జున్‌ ఇరిగేశి, ప్రజ్ఞానంద క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. ప్రిలిమినరీ దశలో 19 ఏళ్ల తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ రెండు, 17 ఏళ్ల తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద నాలుగో స్థానంలో నిలిచారు. 15 రౌండ్ల ప్రిలిమినరీ దశ ముగిసే సరికి తొలి ఎనిమిది స్థానాల్లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు క్వార్టర్స్‌ చేరారు. ఈ దశ పోటీల చివరి రోజు అర్జున్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రదోస్లావ్‌ (పోలండ్‌)తో గేమ్‌ను డ్రా చేసుకున్న అతను.. విన్సెంట్‌ (జర్మనీ), అనీష్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడాడు. దీంతో ఏడు విజయాలు, నాలుగేసి చొప్పున డ్రాలు, ఓటములతో మొత్తం 25 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు ప్రజ్ఞానంద అయిదు విజయాలు, ఎనిమిది డ్రాలు, రెండు ఓటములతో కలిపి మొత్తం 23 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. మరో భారత ఆటగాడు అధిబన్‌ 16వ స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రిలిమినరీ దశలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ 34 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నీమన్‌తో మ్యాచ్‌ నుంచి తప్పుకోవడం మినహా మిగతా గేమ్‌ల్లో అతను అజేయంగా నిలిచాడు. ఏకంగా 10 విజయాలు సాధించాడు. క్వార్టర్స్‌లో క్రిస్టోఫర్‌తో అర్జున్, విన్సెంట్‌తో ప్రజ్ఞానంద తలపడతారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts