రూ.5.3 కోట్లు ఇస్తామన్నా..

ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌లు విస్తృతమవుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌పై ఈ లీగ్‌లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఐపీఎల్‌ కారణంగా క్రికెట్‌ ఊపందుకుంది. వివిధ రాష్ట్రాలు, నగరాల్లోనూ లీగ్‌లు జరుగుతున్నాయి.

Published : 24 Sep 2022 03:15 IST

లీగ్‌లో ఆడనన్న కమిన్స్‌

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌లు విస్తృతమవుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌పై ఈ లీగ్‌లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఐపీఎల్‌ కారణంగా క్రికెట్‌ ఊపందుకుంది. వివిధ రాష్ట్రాలు, నగరాల్లోనూ లీగ్‌లు జరుగుతున్నాయి. అలాంటి కొన్ని లీగ్‌లు ఏకంగా ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ కమిన్స్‌ను ఆడించే ప్రయత్నం చేశాయంటా! ఈ కొన్ని అంతర్‌ నగర (ఇంటర్‌ సిటీ) టీ20 లీగ్‌లు అతని కోసం రూ.5.3 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని తెలిసింది. కానీ దేశానికి ఆడేందుకు ప్రాధాన్యతనివ్వడం కోసం అతను తిరస్కరించాడని సమాచారం. ‘‘ఇలాంటి భారీ అవకాశాలు తరచుగా వస్తున్నాయి. కానీ ఇప్పటికీ దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఆడడానికే తొలి ప్రాధాన్యతనిస్తా’’ అని కమిన్స్‌ చెప్పాడని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని