జాతీయ క్రీడలను ఆరంభించనున్న ప్రధాని

36వ జాతీయ క్రీడలను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 29న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ క్రీడలను ఆరంభిస్తారు. ఇప్పటికే ఈ క్రీడల్లో భాగంగా కొన్ని క్రీడాంశాల్లో పోటీలు ఆరంభమయ్యాయి.

Published : 24 Sep 2022 03:15 IST

అహ్మదాబాద్‌: 36వ జాతీయ క్రీడలను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 29న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ క్రీడలను ఆరంభిస్తారు. ఇప్పటికే ఈ క్రీడల్లో భాగంగా కొన్ని క్రీడాంశాల్లో పోటీలు ఆరంభమయ్యాయి. కానీ అధికారిక ఆరంభోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. ఈ క్రీడలకు తొలిసారి గుజరాత్‌ ఆతిథ్యమిస్తోంది. ఆరంభోత్సవ కార్యక్రమానికి బాలీవుడ్‌ నుంచి సల్మాన్‌, షారుక్‌, రణ్‌బీర్‌ తదితరులు హాజరు కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని