కోచ్‌ తీరు నచ్చడం లేదు

స్పెయిన్‌ మహిళల ఫుట్‌బాల్‌లో కలకలం రేగింది. కోచ్‌ విల్డా తమ భావోద్వేగ స్థితి, ఆరోగ్యంపై ప్రభావం పడేలా వ్యవహరిస్తున్నాడని పేర్కొంటూ జాతీయ జట్టు నుంచి 15 మంది అమ్మాయిలు తప్పుకున్నారు.

Published : 24 Sep 2022 03:15 IST

జట్టు నుంచి తప్పుకున్న 15 మంది మహిళా ఫుట్‌బాల్‌ ప్లేయర్లు

బార్సిలోనా: స్పెయిన్‌ మహిళల ఫుట్‌బాల్‌లో కలకలం రేగింది. కోచ్‌ విల్డా తమ భావోద్వేగ స్థితి, ఆరోగ్యంపై ప్రభావం పడేలా వ్యవహరిస్తున్నాడని పేర్కొంటూ జాతీయ జట్టు నుంచి 15 మంది అమ్మాయిలు తప్పుకున్నారు. తమ సమస్యలకు కోచ్‌ కారణమంటూ వీళ్లు స్పానిష్‌ సాకర్‌ సమాఖ్యకు లేఖలు ఈ మెయిల్‌ చేశారు. కోచ్‌పై వేటు వేయాలని ఆ అమ్మాయిలు స్పష్టంగా డిమాండ్‌ చేయలేదు కానీ, అతని వల్ల ఇబ్బంది కలుగుతుందని మాత్రం పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చేంత వరకూ జట్టుకు అందుబాటులో ఉండమని తేల్చిచెప్పారు. అతని శిక్షణలో జట్టు ప్రదర్శన పట్ల ఈ అమ్మాయిలు సంతృప్తిగా లేకపోవడం అందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ సారి విలేకర్ల సమావేశంలోనూ ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు అమ్మాయిలను దూషించడం, లైంగిక వేధింపుల ఆరోపణలు కోచ్‌పై రాలేవని స్పానిష్‌ సాకర్‌ సమాఖ్య తెలిపింది. క్షమాపణ కోరేంత వరకూ ఆ 15 మంది ప్లేయర్లను తిరిగి జట్టులోకి అనుమతించమని కూడా స్పష్టం చేసింది. వచ్చే నెల 7న స్వీడన్‌, 11న అమెరికాతో స్పెయిన్‌ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల కోసం జట్టును విల్డా వచ్చే వారం ప్రకటించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని