పంత్‌ తుది జట్టులో ఉండాల్సిందే

బెదురన్నదే లేకుండా బ్యాటింగ్‌ చేసే రిషబ్‌ పంత్‌ లాంటి బ్యాట్స్‌మన్‌కు భారత తుది జట్టులో తప్పక స్థానం ఉండాల్సిందే అని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డాడు. పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ల్లో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే విషయంలో కొంత కాలంగా చర్చ నడుస్తోంది.

Published : 24 Sep 2022 03:15 IST

దుబాయ్‌: బెదురన్నదే లేకుండా బ్యాటింగ్‌ చేసే రిషబ్‌ పంత్‌ లాంటి బ్యాట్స్‌మన్‌కు భారత తుది జట్టులో తప్పక స్థానం ఉండాల్సిందే అని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డాడు. పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ల్లో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే విషయంలో కొంత కాలంగా చర్చ నడుస్తోంది. వీరిని మార్చి మార్చి ఆడిస్తున్న టీమ్‌ఇండియా.. ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఈ నేపథ్యంలో గిల్లీ మాట్లాడుతూ.. ‘‘రిషబ్‌లోని ధైర్యం, నిర్భీతి, అతను బౌలింగ్‌ దళాలపై విరుచుకుపడే తీరును బట్టి చూస్తే భారత తుది జట్టులో తప్పక ఉండదగ్గ వాడు. అవసరమైతే కార్తీక్‌ను కూడా ఆడించొచ్చు కానీ, పంత్‌ మాత్రం తుది జట్టులో ఉండి తీరాల్సిందే’’ అని చెప్పాడు. పంత్‌, కార్తీక్‌లిద్దరినీ తుది జట్టులో ఆడించాలని మరో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ సైతం అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని