టైటిల్‌కు చేరువలో వెస్ట్‌జోన్‌

ఈ ఏడాది దులీప్‌ ట్రోఫీని చేజిక్కించుకునేందుకు వెస్ట్‌జోన్‌ రంగం సిద్ధం చేసుకుంది. సౌత్‌జోన్‌ ముంగిట 529 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన వెస్ట్‌జోన్‌ బౌలింగ్‌లోనూ ప్రతాపం చూపుతోంది.

Published : 25 Sep 2022 03:20 IST

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌

కొయంబత్తూర్‌: ఈ ఏడాది దులీప్‌ ట్రోఫీని చేజిక్కించుకునేందుకు వెస్ట్‌జోన్‌ రంగం సిద్ధం చేసుకుంది. సౌత్‌జోన్‌ ముంగిట 529 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన వెస్ట్‌జోన్‌ బౌలింగ్‌లోనూ ప్రతాపం చూపుతోంది. శనివారం, ఆట నాలుగురోజు చివరికి సౌత్‌జోన్‌ ·ంండో ఇన్నింగ్స్‌లో 156/6తో నిలిచింది. రోహన్‌ కన్నమ్మల్‌ (93; 100 బంతుల్లో 14×4, 1×6) ఎదురుదాడికి దిగకుంటే ఆ జట్టు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. రవితేజ (8), సాయికిశోర్‌ (1) క్రీజులో ఉన్నారు. వెస్ట్‌జోన్‌ బౌలర్లలో ఉనద్కత్‌, అతీత్‌, సామ్స్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్ట్‌జోన్‌ 585/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. మూడోరోజు ఆటలో డబుల్‌ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్‌ (265; 323 బంతుల్లో 30×4, 4×6) వ్యక్తిగత స్కోరుకు 56 పరుగులు జతచేసి ఔట్‌ కాగా.. సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (127 నాటౌట్‌; 178 బంతుల్లో 11×4, 2×6) అజేయ సెంచరీతో జట్టును తిరుగులేని స్థితిలో నిలిపాడు. డిక్లేర్‌ చేసే సమయానికి అతడితో పాటు హిత్‌ పటేల్‌ (51) నాటౌట్‌గా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌జోన్‌ 270 పరుగులు చేయగా, సౌత్‌జోన్‌ 327 పరుగులకు ఆలౌటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని