ఫినిషర్‌ పాత్ర కోసం

నిర్దిష్టమైన సాధనతోనే తీవ్రమైన ఒత్తిడిలోనూ భారీ షాట్లు ఆడగలుగుతున్నానని భారత ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు. ‘‘ఫినిషర్‌ పాత్రలో రాణించడం కోసం గత కొంతకాలంగా ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున అదే చేశా.

Published : 25 Sep 2022 03:20 IST

నాగ్‌పూర్‌: నిర్దిష్టమైన సాధనతోనే తీవ్రమైన ఒత్తిడిలోనూ భారీ షాట్లు ఆడగలుగుతున్నానని భారత ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు. ‘‘ఫినిషర్‌ పాత్రలో రాణించడం కోసం గత కొంతకాలంగా ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున అదే చేశా. ఇప్పుడూ అదే కొనసాగిస్తుండడం సంతోషాన్నిస్తోంది. ఎలాంటి షాట్లు ఆడాలనే విషయంపై కోచ్‌ రాహుల్‌, విక్రమ్‌ (బ్యాటింగ్‌ కోచ్‌) సూచనలిస్తున్నారు. ఇలా నిర్దిష్టమైన ప్రాక్టీస్‌ చేస్తా. మరీ ఎక్కువగా సాధన చేయాలనుకోవడం లేదు. మ్యాచ్‌ పరిస్థితులను బట్టి బ్యాటింగ్‌ ఆర్డర్లో స్థానం మారుతూ ఉంటుంది. రెండో టీ20లో ఇన్నింగ్స్‌కు 8 ఓవర్లు కాబట్టి నలుగురు ప్రధాన బౌలర్లనే ఆడించారు. హార్దిక్‌ లాంటి ఆల్‌రౌండర్‌ జట్టులో ఉంటే ఓ అదనపు బ్యాటర్‌ లేదా బౌలర్‌ను ఆడించే సౌలభ్యం దొరుకుతుంది. గత మ్యాచ్‌లో రోహిత్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. కొత్త బంతి బౌలర్లను ఎదుర్కొని అలాంటి షాట్లు ఆడడం కష్టం’’ అని అతను తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని