ఈడెన్‌గార్డెన్స్‌ స్టాండ్‌కు జులన్‌ పేరు

దిగ్గజ బౌలర్‌ జులన్‌ గోస్వామి భారత మహిళల క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ఈడెన్‌ గార్డెన్స్‌లో స్టాండ్‌కు ఆమె పేరు పెట్టాలని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అనుకుంటోంది. బెంగాల్‌లోని నాడియా జిల్లా ఛాక్డా నుంచి జులన్‌ వెలుగులోకి వచ్చింది.

Published : 25 Sep 2022 03:20 IST

కోల్‌కతా: దిగ్గజ బౌలర్‌ జులన్‌ గోస్వామి భారత మహిళల క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ఈడెన్‌ గార్డెన్స్‌లో స్టాండ్‌కు ఆమె పేరు పెట్టాలని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అనుకుంటోంది. బెంగాల్‌లోని నాడియా జిల్లా ఛాక్డా నుంచి జులన్‌ వెలుగులోకి వచ్చింది. ‘‘ఈడెన్‌ గార్డెన్స్‌లో ఒక స్టాండ్‌కు జులన్‌ పేరు పెట్టాలని భావిస్తున్నాం. ఆమె ప్రత్యేకమైన క్రికెటర్‌. ఈ స్టేడియంలోని మిగిలిన స్టాండ్స్‌లోని దిగ్గజాల సరసన నిలిచే అర్హత ఆమెకు ఉంది. సైన్యం అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం. క్యాబ్‌ వార్షిక దినోత్సవం నాడు జులన్‌కు సన్మానించాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని క్యాబ్‌ అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 350పైన వికెట్లతో మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన జులన్‌కు ‘ఛాక్డా ఎక్స్‌ప్రెస్‌’ అనే పేరుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని