షూటింగ్‌లో చరిత్ర

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. జూనియర్‌ పురుషుల ట్రాప్‌ విభాగంలో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో దేశానికి తొలి పతకం అందించారు.

Published : 25 Sep 2022 03:20 IST

షాట్‌గన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి

ఒసైజెక్‌ (క్రొయేషియా): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. జూనియర్‌ పురుషుల ట్రాప్‌ విభాగంలో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో దేశానికి తొలి పతకం అందించారు. శనివారం ఫైనల్లో శపథ్‌, శార్దూల్‌, ఆర్యతో కూడిన భారత త్రయం 6-4 తేడాతో ఇటలీపై విజయం సాధించింది. కాంస్యం అమెరికా ఖాతాలో చేరింది. అంతకుముందు అర్హత రౌండ్లో 205 పాయింట్లతో ఇటలీ తర్వాత రెండో స్థానంలో నిలిచి మన కుర్రాళ్లు తుదిపోరుకు చేరారు. ఇక పసిడి పోరులో ఓ దశలో 0-4తో వెనకబడ్డ భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. తొలి రెండు షూటాఫ్‌ల్లో వెనకబడ్డ షూటర్లు.. ఆ తర్వాత నిలకడ ప్రదర్శించారు. కచ్చితమైన గురితో లక్ష్యాన్ని చేరుకుని ఛాంపియన్లుగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని