స్లెడ్జింగ్‌ చేశాడని జైశ్వాల్‌ బయటికి

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఆఖరిరోజైన ఆదివారం అనూహ్య ఉదంతం చోటు చేసుకుంది. సౌత్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగుతుండగా బ్యాటర్‌ రవితేజను స్లెడ్జింగ్‌ చేసినందుకు వెస్ట్‌జోన్‌ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను ఆ జట్టు కెప్టెన్‌ ఆజింక్య రహానె మైదానాన్ని వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.

Published : 26 Sep 2022 02:26 IST

వెస్ట్‌జోన్‌ కెప్టెన్‌ రహానె అనూహ్య నిర్ణయం

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఆఖరిరోజైన ఆదివారం అనూహ్య ఉదంతం చోటు చేసుకుంది. సౌత్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగుతుండగా బ్యాటర్‌ రవితేజను స్లెడ్జింగ్‌ చేసినందుకు వెస్ట్‌జోన్‌ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను ఆ జట్టు కెప్టెన్‌ ఆజింక్య రహానె మైదానాన్ని వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. వికెట్లకు దగ్గరగా ఫీల్డింగ్‌ చేస్తున్న యశస్వి పదే పదే నోటికి పని చెబుతుండడంతో రవితేజ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అయినా కూడా యశస్వి తీరు మార్చుకోకపోవడంతో రహానె అతడిని బయటికి పంపించాడు. ఏడు ఓవర్లు బయట ఉన్న తర్వాత అతను మళ్లీ మైదానంలోకి వచ్చాడు. ‘‘ప్రత్యర్థులు, అంపైర్లు, మ్యాచ్‌ అధికారులను ఎప్పుడూ గౌరవించాలి. ఏదైనా అనుకోని ఉదంతం జరిగినప్పుడు సమర్థంగా ఎదుర్కోవాలి’’ అని రహానె చెప్పాడు. వెస్ట్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కడం కొసమెరుపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని