కెరీర్‌ మొదలైంది జాతీయ క్రీడలతోనే

జాతీయ క్రీడలతోనే తన కెరీర్‌ మొదలైందని, ఈ క్రీడలు తనకెంతో ప్రత్యేకమని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తెలిపింది. గుజరాత్‌లో ఈ నెల 27న 36వ జాతీయ క్రీడలు అధికారికంగా ఆరంభం కానున్న నేపథ్యంలో సానియా ఈ క్రీడలతో తన అనుబంధాన్ని సానియా గుర్తు చేసుకుంది. ‘‘2002 జాతీయ క్రీడల్లో

Published : 26 Sep 2022 02:26 IST

హైదరాబాద్‌: జాతీయ క్రీడలతోనే తన కెరీర్‌ మొదలైందని, ఈ క్రీడలు తనకెంతో ప్రత్యేకమని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తెలిపింది. గుజరాత్‌లో ఈ నెల 27న 36వ జాతీయ క్రీడలు అధికారికంగా ఆరంభం కానున్న నేపథ్యంలో సానియా ఈ క్రీడలతో తన అనుబంధాన్ని సానియా గుర్తు చేసుకుంది. ‘‘2002 జాతీయ క్రీడల్లో పోటీపడినప్పుడు నా వయసు 16 ఏళ్లే. ఈ క్రీడల్లో రాణించడం ద్వారా వెలుగులోకి వచ్చా. నా అంతర్జాతీయ కెరీర్‌కు గట్టి పునాది పడింది అప్పుడే. మన సత్తా ఏంటో తెలుసుకోవడానికి జాతీయ క్రీడలు మంచి వేదిక. దేశవ్యాప్తంగా నాణ్యమైన అథ్లెట్లు ఈ క్రీడలకు వస్తారు. ఇక్కడ రాణిస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. త్వరలో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనబోతున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు’’ అని సానియా చెప్పింది. భారత్‌లో మహిళల టెన్నిస్‌కు చిరునామాగా నిలిచిన సానియా డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ కలిపి ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని