కుల్‌దీప్‌ హ్యాట్రిక్‌

కుల్‌దీప్‌ యాదవ్‌ (4/51) హ్యాట్రిక్‌ సాధించడంతో న్యూజిలాండ్‌-ఎతో అనధికార మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌-ఎ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌-ఎ 47 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. జో కార్టర్‌ (72; 80 బంతుల్లో 1×4, 3×6), రచిన్‌

Published : 26 Sep 2022 02:26 IST

వన్డే సిరీస్‌ భారత్‌-ఎ కైవసం

చెన్నై: కుల్‌దీప్‌ యాదవ్‌ (4/51) హ్యాట్రిక్‌ సాధించడంతో న్యూజిలాండ్‌-ఎతో అనధికార మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌-ఎ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌-ఎ 47 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. జో కార్టర్‌ (72; 80 బంతుల్లో 1×4, 3×6), రచిన్‌ రవీంద్ర (61; 65 బంతుల్లో 9×4) రాణించడంతో ఒక దశలో ఆ జట్టు 106/2తో మెరుగ్గా కనిపించింది. కానీ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుని తక్కువ స్కోరుకు పరిమితమైంది. 47వ ఓవర్లో వరుసగా బీక్‌ (4), వాకర్‌ (0), డఫీ (0) వికెట్లు ఖాతాలో వేసుకున్న కుల్‌దీప్‌.. హ్యాట్రిక్‌తో కివీస్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. భారత బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ (2/50), రిషి ధావన్‌ (2/16) కూడా రాణించారు. పృథ్వీ షా (77; 48 బంతుల్లో 11×4, 3×6) చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్‌-ఏ 34 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. తొలి వికెట్‌కు రుతురాజ్‌ గైక్వాడ్‌ (30)తో కలిసి పృథ్వీ 82 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ సంజు శాంసన్‌ (37), రజత్‌ పటిదార్‌ (20) రాణించడంతో భారత్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. కానీ ఒక దశలో 180/6తో తడబడినా.. రిషి ధావన్‌ (22 నాటౌట్‌), శార్థూల్‌ ఠాకూర్‌ (25 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా జట్టును గెలిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని