దులీప్‌ ట్రోఫీ వెస్ట్‌దే

ఈ ఏడాది దులీప్‌ ట్రోఫీలో వెస్ట్‌ జోన్‌ విజేతగా అవతరించింది. ఫైనల్లో ఆ జట్టు 294 పరుగుల భారీ తేడాతో సౌత్‌ జోన్‌ను చిత్తు చేసింది. 529 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 154/6తో చివరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌత్‌ 234 పరుగులకే ఆలౌటైంది. చివరి రోజు పడిన నాలుగు వికెట్లలో

Published : 26 Sep 2022 04:09 IST

ఫైనల్లో సౌత్‌జోన్‌ చిత్తు

కొయంబత్తూర్‌: ఈ ఏడాది దులీప్‌ ట్రోఫీలో వెస్ట్‌ జోన్‌ విజేతగా అవతరించింది. ఫైనల్లో ఆ జట్టు 294 పరుగుల భారీ తేడాతో సౌత్‌ జోన్‌ను చిత్తు చేసింది. 529 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 154/6తో చివరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌత్‌ 234 పరుగులకే ఆలౌటైంది. చివరి రోజు పడిన నాలుగు వికెట్లలో మూడు సామ్స్‌ ములానీ (4/51) ఖాతాలో చేరాయి. రవితేజ (53; 97 బంతుల్లో 3×4, 1×6).. సాయి కిశోర్‌ (82 బంతుల్లో 7)తో కలిసి వెస్ట్‌ విజయాన్ని ఆలస్యం చేశాడు. కానీ సాయికిశోర్‌ను చింతన్‌ గజా (1/47) ఔట్‌ చేయడంతో సౌత్‌ ఇన్నింగ్స్‌ ఇంకెంతోసేపు కొనసాగలేదు. వెస్ట్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ (2/28), అతీత్‌ సేథ్‌ (2/29) కూడా ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌ 270 పరుగులు చేయగా.. సౌత్‌ 327 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను వెస్ట్‌ 585/4 వద్ద డిక్లేర్‌ చేసింది. వెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (265) డబుల్‌ సెంచరీ చేయగా.. సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (127) శతకంతో మెరిశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని