అక్షర్‌ అదరహో..

జడేజా గైర్హాజరీలో టీమ్‌ఇండియా బలహీనపడుతుందని అంతా భావించినా.. అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి అక్షర్‌ పటేల్‌ రూపంలో ఆ జట్టుకు అసాధారణ ఆటగాడు దొరికాడని ఆస్ట్రేలియా కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ అన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అక్షర్‌ అత్యధిక

Published : 27 Sep 2022 02:09 IST

హైదరాబాద్‌: జడేజా గైర్హాజరీలో టీమ్‌ఇండియా బలహీనపడుతుందని అంతా భావించినా.. అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి అక్షర్‌ పటేల్‌ రూపంలో ఆ జట్టుకు అసాధారణ ఆటగాడు దొరికాడని ఆస్ట్రేలియా కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ అన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అక్షర్‌ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచిన నేపథ్యంలో మెక్‌డొనాల్డ్‌ స్పందించాడు. ‘‘ఈ సిరీస్‌లో అక్షర్‌ గొప్ప ప్రదర్శన చేశాడు. జడ్డూ లేకపోవడం భారత్‌కు పెద్దగా బలహీనత అవుతుందని అంతా భావించారు. కానీ ఆ జట్టుకు మరో మంచి ఆటగాడు దొరికాడు’’ అని భారత్‌ సిరీస్‌ గెలిచిన అనంతరం అతడు వ్యాఖ్యానించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతంగా ఆడాడని, ప్రపంచకప్‌లో అతడు అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ కాబోతున్నాడని మెక్‌డొనాల్డ్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని