అనేకసార్లు హెచ్చరించాకే...

చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రనౌట్‌ చేసిన తీరుపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దీప్తి తాజాగా స్పందించింది. మన్కడింగ్‌ చేయడానికి ముందు డీన్‌ను అనేకసార్లు హెచ్చరించామని వెల్లడించింది. ‘‘మేం పదే పదే చేసిన హెచ్చరికలను డీన్‌ విస్మరించడంతో

Published : 27 Sep 2022 02:09 IST

రనౌట్‌ వివాదంపై దీప్తి

కోల్‌కతా: చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రనౌట్‌ చేసిన తీరుపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దీప్తి తాజాగా స్పందించింది. మన్కడింగ్‌ చేయడానికి ముందు డీన్‌ను అనేకసార్లు హెచ్చరించామని వెల్లడించింది. ‘‘మేం పదే పదే చేసిన హెచ్చరికలను డీన్‌ విస్మరించడంతో మేమలా చేశాం. మేం నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం’’ అని చెప్పింది. డీన్‌ను రనౌట్‌ చేయడానికి ముందు అంపైర్లతో కూడా చెప్పామని తెలిపింది. ‘‘డీన్‌ పదే పదే ముందుకెళ్లడంపై అంపైర్లకు కూడా చెప్పాం. కానీ డీన్‌ తీరు మారలేదు. అలాంటి పరిస్థితుల్లో మేం చేయగలిగిందేమీ లేదు’’ అని దీప్తి పేర్కొంది. ఇంగ్లాండ్‌ మహిళలతో సిరీస్‌ను భారత్‌ 3-0తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

అది అబద్ధం: నైట్‌

మన్కడింగ్‌ చేయడానికి ముందు డీన్‌ను అనేకసార్లు హెచ్చరించామని భారత్‌ అబద్ధాలు చెబుతోందని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ నైట్‌ ఆరోపించింది. ‘‘మ్యాచ్‌ అయిపోయింది. చార్లీని నిబంధనల మేరకే ఔట్‌ చేశారు. మ్యాచ్‌లో విజయానికి భారత్‌ అర్హమైందే. కానీ మన్కడింగ్‌కు ముందు ఆ జట్టు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదు. అలా చేయాల్సిన అవసరం లేదు కూడా. కానీ రనౌట్‌ చేయడం సమంజసమే అనిపిస్తే.. తన చర్యను సమర్థించుకోవడానికి భారత్‌ అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు’’ అని నైట్‌ చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని