మంచు ప్రభావం వల్లే ఆ ఓటములు: రాఠోడ్‌

ప్రత్యర్థి ముందు చాలినంత లక్ష్యాన్ని ఉంచినా ఇటీవల టీమ్‌ఇండియా కాపాడుకోవడంలో విఫలమవుతోంది. సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకుంటోంది. అందుకు కారణం ఆఖరి ఓవర్లలో బౌలర్ల తడబాటు అన్నది స్పష్టం.

Published : 28 Sep 2022 02:45 IST

తిరువనంతపురం: ప్రత్యర్థి ముందు చాలినంత లక్ష్యాన్ని ఉంచినా ఇటీవల టీమ్‌ఇండియా కాపాడుకోవడంలో విఫలమవుతోంది. సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకుంటోంది. అందుకు కారణం ఆఖరి ఓవర్లలో బౌలర్ల తడబాటు అన్నది స్పష్టం. అయితే జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ వాదన భిన్నంగా ఉంది. మంచు ప్రభవం వల్ల జట్టు ఓడిందని అతడు అంటున్నాడు. ఆసియా కప్‌ సూపర్‌-4 దశ మొదలుకుని ఇప్పటిదాకా ఆడిన ఆరు టీ20ల్లో భారత్‌ మూడింట్లో (పాకిస్థాన్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా) ఓడింది. ఆసియా కప్‌లో మంచు ప్రభావమే లేదు. ‘‘లక్ష్యాలను కాపాడుకునే విషయంలో మెరుగుపడటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి మ్యాచ్‌లో టాస్‌ కీలకం అవుతుంది. అన్నిసార్లూ లక్ష్యాన్ని కాపాడుకోలేం. మంచు ప్రభావం ఉండడం వల్ల కూడా ప్రత్యర్థి జట్లకు ఛేదన సులభం అవుతోంది. ఈ విషయంలో బౌలర్లను తప్పుబట్టలేం. వాళ్లు చివరి ఓవర్‌ దాకా మ్యాచ్‌ను తీసుకెళ్తున్నారు. కొన్ని చెత్త బంతులనే అందరూ గుర్తుంచుకుంటారు. కానీ మన బౌలర్ల ప్రయత్నాన్ని గుర్తించరు’’ అని విక్రమ్‌ పేర్కొన్నాడు. బౌలర్లు కాపాడుకునేలా బ్యాటర్లు స్కోర్లు చేయడం లేదనే వాదనను కూడా అతడు ఖండించాడు. ‘‘బ్యాటర్లు రాణించడం అనేది పిచ్‌ పరిస్థితులను బట్టి ఉంటుంది. గత టీ20 ప్రపంచకప్‌లో ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు మా బ్యాటర్లు మంచి స్కోర్లే సాధిస్తున్నారు. మరింత దూకుడుగా ఆడుతున్నారు. వారి దృక్పథమే ఇందుకు నిదర్శనం. బౌలర్లకు తమ బలాలేంటో తెలుసు. వాళ్లు ప్రణాళికతో ఉమ్మడిగా రాణిస్తే సత్తా చాటగలరు’’ అని విక్రమ్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts