భారత్ తొలి ప్రత్యర్థి స్పెయిన్
భారత్ ఆతిథ్యమివ్వనున్న హాకీ ప్రపంచకప్ షెడ్యూలును ఎఫ్ఐహెచ్ మంగళవారం విడుదల చేసింది. టోర్నీ తొలి రోజు జనవరి 13న రూర్కెలాలో స్పెయిన్‌తో పోరుతో భారత్ తన టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం
హాకీ ప్రపంచకప్
దిల్లీ: భారత్ ఆతిథ్యమివ్వనున్న హాకీ ప్రపంచకప్ షెడ్యూలును ఎఫ్ఐహెచ్ మంగళవారం విడుదల చేసింది. టోర్నీ తొలి రోజు జనవరి 13న రూర్కెలాలో స్పెయిన్‌తో పోరుతో భారత్ తన టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అయిదో స్థానంలో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్, స్పెయిన్, వేల్స్‌తో పాటు పూల్-డిలో ఉంది. భారత్ తన రెండో మ్యాచ్‌లో జనవరి 15న ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. ఆ తర్వాత తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో 19న వేల్స్‌ను ఎదుర్కొంటుంది. ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా పూల్-ఎలో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం, జర్మనీ, కొరియా, జపాన్ గ్రూప్-బిలో తలపడతాయి. నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ గ్రూప్-సిలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్