ఓటమి చిరాకు.. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు

మహిళల బాస్కెట్‌బాల్‌ ప్రపంచకప్‌ సందర్భంగా ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డ మాలి జట్టు క్రీడాకారిణులు తాజాగా క్షమాపణ చెప్పారు. సెర్బియాతో ఓటమి తర్వాత మీడియాకు కేటాయించిన

Published : 28 Sep 2022 02:45 IST

సిడ్నీ: మహిళల బాస్కెట్‌బాల్‌ ప్రపంచకప్‌ సందర్భంగా ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డ మాలి జట్టు క్రీడాకారిణులు తాజాగా క్షమాపణ చెప్పారు. సెర్బియాతో ఓటమి తర్వాత మీడియాకు కేటాయించిన చోట సలిమాటో, ఎలిసబెత్‌ పెనుగులాడుతూ కనిపించారు. మొదట ఎలిసబెత్‌పై సలిమాటో పంచ్‌లు విసిరింది. వెంటనే మిగతా మాలి క్రీడాకారిణులు వీళ్లను విడదీసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన సెర్బియా మీడియాకు చిక్కింది. దీనిపై ఫిబా విచారణ జరుపుతోంది. ‘‘ఆ ఓటమితో మాకు చిరాకు కలిగింది. ఫిబా, ప్రపంచ బాస్కెట్‌బాల్‌, ప్రపంచకప్‌కు క్షమాపణ చెబుతున్నాం. కావాలని మేం అలా చేయలేదు’’ అని ఇద్దరి తరపున సలిమాటో పేర్కొంది. ఆ తర్వాత కెనడాతో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ బరిలో దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని