కోహ్లి పవర్‌ గేమ్‌ తిరిగొచ్చింది

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పవర్‌ గేమ్‌ తిరిగొచ్చిందని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు పరిస్థితులన్నీ కోహ్లీకి అనుకూలంగా మారుతున్నాయని తెలిపాడు. ‘‘ఆసియా కప్‌ మొదలుకుని ప్రతి

Published : 28 Sep 2022 02:59 IST

దిల్లీ: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పవర్‌ గేమ్‌ తిరిగొచ్చిందని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు పరిస్థితులన్నీ కోహ్లీకి అనుకూలంగా మారుతున్నాయని తెలిపాడు. ‘‘ఆసియా కప్‌ మొదలుకుని ప్రతి మ్యాచ్‌లో కోహ్లి పరుగులు సాధించాడు. పరుగులు రాబట్టడమే కాదు బ్యాటింగ్‌లో పురోగతి కూడా కనిపిస్తోంది. అతని పవర్‌ గేమ్‌ తిరిగొచ్చింది. ఒకప్పుడు అతను పరుగులు సాధిస్తున్నా పవర్‌ గేమ్‌ కనిపించేది కాదు. ఇప్పుడు మళ్లీ మొదలైంది. మంచి బంతుల్ని బౌండరీలు, భారీ సిక్సర్లుగా మలుస్తున్నాడు. అదంతా అతని ఆత్మవిశ్వాసం. ఆసియా కప్‌ నుంచి నెమ్మదిగా అన్నీ తన దారిలోకి వచ్చాయి. పుల్‌ షాట్లు ఆడాడు. సిక్సర్లు స్టాండ్స్‌లోకి వెళ్తున్నాయి’’ అని చెప్పాడు. భువనేశ్వర్‌ ఫామ్‌ గురించి మాట్లాడుతూ..‘‘అతిగా క్రికెట్‌ ఆడటమే భువనేశ్వర్‌ లయ తప్పడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది అతను చాలా మ్యాచ్‌లు ఆడాడు. భువి పనిభారాన్ని ఎక్కువగా తీసుకోలేడు. అతను ఒకటి లేదా రెండు ఫార్మాట్లలో మాత్రమే ఆడతాడు. విరామం తీసుకుని పునరాగమనం చేసినప్పుడు మొదటి కొన్ని మ్యాచ్‌లో భువి అత్యుత్తమంగా రాణిస్తాడు. కాబట్టి అతను లయ తప్పడానికి అలసటే కారణం’’ అని మంజ్రేకర్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని