భారత్‌-ఎ క్లీన్‌స్వీప్‌

న్యూజిలాండ్‌-ఎతో అనధికార మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌-ఎ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం ఆఖరిదైన మూడో వన్డేలో భారత్‌-ఎ 106 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మన జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులు చేసింది.

Published : 28 Sep 2022 02:59 IST

చెన్నై: న్యూజిలాండ్‌-ఎతో అనధికార మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌-ఎ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం ఆఖరిదైన మూడో వన్డేలో భారత్‌-ఎ 106 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మన జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (54; 68 బంతుల్లో 1×4, 2×6), తిలక్‌వర్మ (50; 62 బంతుల్లో 1×4, 3×6), శార్దూల్‌ ఠాకూర్‌ (51; 33 బంతుల్లో 4×4, 3×6) అర్ధ సెంచరీలతో మెరిశారు. ఆరంభంలో శాంసన్‌, తిలక్‌వర్మ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేస్తే.. ఆఖర్లో శార్దూల్‌ మెరుపు షాట్లతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. రాజ్‌ బవా (4/11), రాహుల్‌ చాహర్‌ (2/39), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/29) విజృంభించడంతో ఛేదనలో కివీస్‌-ఎ 38.3 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. డేన్‌ క్లెవర్‌ (83; 89 బంతుల్లో 9×4, 2×6) పోరాటం ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని