భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లపై ఇంగ్లాండ్‌ ఆసక్తి

చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగి దశాబ్దం కావస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఆ మ్యాచ్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది.

Updated : 28 Sep 2022 11:17 IST

లండన్‌: చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగి దశాబ్దం కావస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఆ మ్యాచ్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అదే ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగితే ఆదరణ, వ్యాపారం.. ఇలా ఏ రకంగా చూసుకున్నా లాభమే. ఇప్పుడీ అవకాశాన్ని ఉపయోగించుకుని లాభపడాలని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌తో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ను తటస్థ వేదికగా ఎంచుకోవాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను ఈసీబీ కోరినట్లు తెలిసింది. కానీ అందుకు అవకాశమే లేదని బీసీసీఐ తెలిపింది. ‘‘భారత్‌, పాక్‌ సిరీస్‌ కోసం పీసీబీతో ఇంగ్లాండ్‌ మాట్లా డడమే విచిత్రంగా ఉంది. పాక్‌తో సిరీస్‌పై నిర్ణయం బీసీసీఐ చేతుల్లో కూడా లేదు. అది భారత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ప్రస్తుతానికి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఐసీసీ  టోర్నీల్లోనే పాక్‌తో తలపడతాం’’ అని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఈ మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లో జరిగితే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చే అవకాశముంది. దీంతో పాటు స్పాన్సర్‌షిప్‌, టీవీ ప్రసార హక్కులు  ఇలా భారీ మొత్తంలో ఆదాయం సంపాదించవచ్చని ఈసీబీ చూస్తోందని సమాచారం. కానీ ఈసీబీ ప్రతిపాదనకు పాకిస్థాన్‌ కూడా అంగీకరించలేదని తెలిసింది. టీమ్‌ఇండియా, పాక్‌ మధ్య చివరగా 2012-13లో భారత్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌ జరిగింది. 2007లో ఆఖరిగా ఈ రెండు జట్లు టెస్టు సిరీస్‌ ఆడాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని