సూర్య.. మళ్లీ రెండులోకి

టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి టీ20 బ్యాటర్ల జాబితాలో తన కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకు రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో మూడో టీ20లో 36 బంతుల్లో 69 పరుగులతో జట్టు సిరీస్‌ సొంతం

Updated : 29 Sep 2022 04:23 IST

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి టీ20 బ్యాటర్ల జాబితాలో తన కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకు రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో మూడో టీ20లో 36 బంతుల్లో 69 పరుగులతో జట్టు సిరీస్‌ సొంతం చేసుకోవడంలో అతను కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగై 801 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచాడు. ఈ ఏడాది ఆగస్టులో అతను తొలిసారి ద్వితీయ స్థానం సొంతం చేసుకున్న విషయం విదితమే. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (799) మూడో ర్యాంకుకు పడిపోయాడు. ఆ జట్టు ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ (861) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్‌ శర్మ (13వ) స్థానంలో మార్పు లేదు. కోహ్లి ఓ స్థానం ఎగబాకి 15వ ర్యాంకులో నిలిచాడు. బ్యాట్‌తో తడబడుతున్న కేఎల్‌ రాహుల్‌ నాలుగు స్థానాలు దిగజారి 22కు చేరాడు. బౌలర్ల జాబితాలో భువనేశ్వర్‌ 9 నుంచి పదికి పడిపోయాడు. ఆసీస్‌తో సిరీస్‌లో రాణించిన అక్షర్‌ పటేల్‌ ఏకంగా 11 స్థానాలు మెరుగై 18వ ర్యాంకు అందుకున్నాడు. చాహల్‌ (26వ), హర్షల్‌ (37వ) మెరుగయ్యారు. ఆస్ట్రేలియా పేసర్‌ హేజిల్‌వుడ్‌ (737) నంబర్‌వన్‌ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్‌ పాండ్య (5వ) స్థానంలో మార్పు లేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని