దక్షిణాఫ్రికాతో వన్డేల్లో శాంసన్‌!

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లకు టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోలేకపోయిన యువ బ్యాటర్‌ సంజు శాంసన్‌ సఫారీ సేనతో వన్డేల్లో ఆడే అవకాశముంది. ఈ విషయాన్ని బీసీసీఐ

Published : 29 Sep 2022 02:11 IST

తిరువనంతపురం: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లకు టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోలేకపోయిన యువ బ్యాటర్‌ సంజు శాంసన్‌ సఫారీ సేనతో వన్డేల్లో ఆడే అవకాశముంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చూచాయగా చెప్పాడు. శాంసన్‌ బీసీసీఐ ప్రణాళికల్లో ఉన్నాడని దక్షిణాఫ్రికా, భారత్‌ తొలి టీ20 కోసం తిరువనంతపురానికి వచ్చిన దాదా పేర్కొన్నాడు. ‘‘కేరళలో ఉత్తమ స్టేడియం ఉంది. గొప్ప అభిమానులున్నారు. ఇక్కడ నాకు మంచి జ్ఞాపకాలున్నాయి. శాంసన్‌ ఓ అగ్రశ్రేణి ఆటగాడు. టీమ్‌ఇండియా కోసం బీసీసీఐ ప్రణాళికల్లో అతనున్నాడు. అతనిప్పుడు వన్డే జట్టులో భాగమే. మరో ఇద్దరు కేరళ ఆటగాళ్లు రోహన్‌, బాసిల్‌ థంపి కూడా ఉత్తమంగా రాణిస్తున్నారు. బీసీసీఐ రొటేషన్‌ విధానం ప్రకారం కేరళలో భవిష్యత్‌లో మరిన్ని మ్యాచ్‌లు జరుగుతాయి’’ అని అతను తెలిపాడు. గంగూలీ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీ20 సిరీస్‌ ముగిశాక దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత ద్వితీయ శ్రేణి జట్టులో కేరళ ఆటగాడు శాంసన్‌ ఆడే అవకాశం ఉంది. అంతేకాకుండా ధావన్‌ సారథ్యంలోని ఆ జట్టుకు అతను వైస్‌ కెప్టెన్‌గానూ ఎంపికయ్యే ఆస్కారముంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts