ఉమేశ్‌, అయ్యర్‌, షాబాజ్‌లకు చోటు

పేసర్‌ ఉమేశ్‌యాదవ్‌, బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌లకు టీమ్‌ఇండియా జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బుధవారం ఈ ముగ్గురిని సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఎంపిక

Updated : 29 Sep 2022 04:11 IST

తిరువనంతపురం: పేసర్‌ ఉమేశ్‌యాదవ్‌, బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌లకు టీమ్‌ఇండియా జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బుధవారం ఈ ముగ్గురిని సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. కొవిడ్‌-19 కారణంగా పేసర్‌ మహ్మద్‌ షమి, గాయంతో ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా జట్టుకు దూరమయ్యారు. ‘‘షమి స్థానంలో ఉమేశ్‌, హుడా బదులు అయ్యర్‌ను సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. షాబాజ్‌కు కూడా జట్టులో చోటు కల్పించింది’’ అని బీసీసీఐ పేర్కొంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న పేసర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ మళ్లీ జట్టులో చేరాడు. టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు విశ్రాంతి లభించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, పేసర్‌ భువనేశ్వర్‌లు జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిపోర్ట్‌ చేయనున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం సెలక్షన్‌ కమిటీ జట్టులో మార్పులు చేసిన కాసేపటికే మహ్మద్‌ షమి కరోనా నుంచి కోలుకున్నట్లు తేలింది. కొవిడ్‌ పరీక్షలో తనకు నెగటివ్‌ వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో అతడు ప్రకటించాడు.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌, అర్ష్‌దీప్‌, హర్షల్‌, దీపక్‌ చాహర్‌, బుమ్రా, ఉమేశ్‌, శ్రేయస్‌, షాబాజ్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts