పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంపై దృష్టి: అర్ష్‌దీప్‌

టీ20 ప్రపంచకప్‌కు ముందు పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంపై దృష్టిసారించినట్లు టీమ్‌ఇండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ అన్నాడు. దక్షిణాప్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ (3/32)

Published : 30 Sep 2022 02:27 IST

తిరువనంతపురం: టీ20 ప్రపంచకప్‌కు ముందు పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంపై దృష్టిసారించినట్లు టీమ్‌ఇండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ అన్నాడు. దక్షిణాప్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ (3/32) కొత్త బంతితో నిప్పులు చెరిగి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ‘‘మ్యాచ్‌ ఆరంభంలోనే వికెట్లు తీయడం గొప్ప అనుభూతినిస్తుంది. పిచ్‌పై బంతి స్వింగ్‌ అవుతుంది. సరైన ప్రాంతాల్లో బంతిని సంధించడం ఫలితాన్నిచ్చింది. పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలన్నది జట్టు ప్రధాన ఉద్దేశం. ఎలాంటి పరిస్థితులు.. ఏ సందర్భంలో ఉన్నా జట్టు అవసరాలకు తగ్గట్లుగా ఆడాలి. ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితుల్ని పరిశీలిస్తాం. అక్కడ సత్తాచాటాలని భావిస్తున్నా. మెగా టోర్నీకి ముందు అన్ని అంశాలను స్పృశిస్తున్నాం. అన్ని వ్యూహాల్ని మైదానంలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. బుధవారం ప్రదర్శన గొప్ప పవర్‌ ప్లే బౌలింగ్‌కు నిదర్శనం. రానున్న రోజుల్లో మరింత అద్భుతంగా రాణించాలని అనుకుంటున్నాం’’ అని అర్ష్‌దీప్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని