క్వార్టర్స్‌లో సిక్కి జోడీ

వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో సిక్కిరెడ్డి-రోహన్‌ కపూర్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సిక్కి జంట 21-10, 19-21, 21-18తో ఫాన్‌ యాన్‌-యింగ్‌ షింగ్‌ (హాంకాంగ్‌)పై

Updated : 30 Sep 2022 05:24 IST

హో చిన్‌ మిన్‌ సిటీ: వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో సిక్కిరెడ్డి-రోహన్‌ కపూర్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సిక్కి జంట 21-10, 19-21, 21-18తో ఫాన్‌ యాన్‌-యింగ్‌ షింగ్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించింది. సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో రిత్విక్‌ సతీష్‌ 21-19, 17-21, 19-21తో కెన్‌ యోన్‌ (మలేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. రెండో రౌండ్లో భారత స్టార్‌ సాయిప్రణీత్‌కు షాకిచ్చిన సతీష్‌.. ప్రిక్వార్టర్స్‌లో పోరాడినా పరాజయం తప్పలేదు.


చైనాలో బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌ టోర్నీ

బీజింగ్‌: కరోనా మహమ్మారి మొదలైన తర్వాత చైనా తొలిసారి ఓ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌ చైనాలోని గాంగ్జూలో జరగనుంది. డిసెంబర్‌ 14న ఈ టోర్నీ ఆరంభం కానుంది. మరోవైపు కొవిడ్‌-19 కఠిన నిబంధనల కారణంగా నవంబర్‌లో జరగాల్సిన హాంకాంగ్‌ ఓపెన్‌ వరుసగా మూడో ఏడాది రద్దయింది.


శివకు టైటిల్‌

బ్యాంకాక్‌: డబ్ల్యూబీసీ ఆసియా కాంటినెంటల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత సూపర్‌ మిడిల్‌వెయిట్‌ బాక్సర్‌ శివ ఠాక్రాన్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో శివ టెక్నికల్‌ నాకౌట్‌ (టీకేఓ)తో ఆదిల్‌ హఫీజ్‌ (మలేసియా)పై విజయం సాధించాడు. ప్రత్యర్థిపై శివ పంచ్‌ల వర్షం కురిపించడంతో రిఫరీలు ఎనిమిదో రౌండ్లో బౌట్‌ను నిలిపివేశారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని