చెలరేగిన నమన్‌, ఇర్ఫాన్‌

రోడ్డు భద్రత ప్రపంచ టీ20 సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నమన్‌  ఓజా (90 నాటౌట్‌; 62 బంతుల్లో 7×4, 5×6), ఇర్ఫాన్‌  పఠాన్‌ (37 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4, 4×6) ఆకాశమే హద్దుగా

Updated : 30 Sep 2022 05:24 IST

ఫైనల్లో ఇండియా లెజెండ్స్‌

రాయ్‌పుర్‌: రోడ్డు భద్రత ప్రపంచ టీ20 సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నమన్‌  ఓజా (90 నాటౌట్‌; 62 బంతుల్లో 7×4, 5×6), ఇర్ఫాన్‌  పఠాన్‌ (37 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4, 4×6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో జరిగిన తొలి సెమీస్‌లో ఇండియా లెజెండ్స్‌ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై విజయం సాధించింది. మొదట ఆసీస్‌ లెజెండ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు రాబట్టింది. కెప్టెన్‌ షేన్‌ వాట్సన్‌ (30; 21 బంతుల్లో 6×4), అలెక్స్‌ డూలన్‌ (35; 31 బంతుల్లో 5×4), బెన్‌డంక్‌ (46; 26 బంతుల్లో 5×4, 2×6), కామెరూన్‌ వైట్‌ (30 నాటౌట్‌; 18 బంతుల్లో 1×4, 2×6) చెలరేగారు. ఇండియా లెజెండ్స్‌ బౌలర్లలో అభిమన్యు మిథున్‌ (2/25), రాహుల్‌శర్మ (1/20), యూసుఫ్‌ పఠాన్‌ (2/36) సఫలమయ్యారు. ఇండియా లెజెండ్స్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్‌ సచిన్‌ తెందుల్కర్‌ (10), సురేశ్‌ రైనా (11), యువరాజ్‌సింగ్‌ (18), యూసుఫ్‌ పఠాన్‌ (1)లు నిరాశపరిచినా నమన్‌, ఇర్ఫాన్‌ పని పూర్తిచేశారు. శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో శ్రీలంక లెజెండ్స్‌తో వెస్టిండీస్‌ లెజెండ్స్‌ తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని