అది ఫెదరర్‌కే సాధ్యం

ఆటతో కేవలం టెన్నిస్‌ అభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తనకు మద్దతుగా నిలిచేలా ఏకం చేయడం ఫెదరర్‌కే సాధ్యమైందని టీమ్‌ఇండియా ఆటగాడు కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఫెదరర్‌ గురించి

Published : 30 Sep 2022 02:32 IST

దిల్లీ: ఆటతో కేవలం టెన్నిస్‌ అభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తనకు మద్దతుగా నిలిచేలా ఏకం చేయడం ఫెదరర్‌కే సాధ్యమైందని టీమ్‌ఇండియా ఆటగాడు కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఫెదరర్‌ గురించి కోహ్లి మాట్లాడిన వీడియోను ఏటీపీ టూర్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘‘హలో.. రోజర్‌. ఈ వీడియోను నీకు పంపించడం నాకు దక్కిన గౌరవం. మాకెన్నో అందమైన జ్ఞాపకాలు, మధురానుభూతులు ఇచ్చిన నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. 2018 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వ్యక్తిగతంగా నిన్ను కలిసే అవకాశం కలిగింది. నా జీవితంలో ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోను. కేవలం టెన్నిస్‌ అభిమానులే కాకుండా బయటి ప్రజలు కూడా నీ వెనకాల నిలవడం, నీకు మద్దతునివ్వడం గొప్ప విషయం. ఇలా ప్రజలను ఏకం చేసిన మరో ఆటగాణ్ని నేనెప్పుడూ చూడలేదు. అది కృత్రిమంగా సృష్టించేది కాదు. నీకెప్పుడూ ఆ ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. కోర్టులో నీ ఉనికికి ఏదీ సాటిరాదు. నా వరకైతే ఆల్‌టైమ్‌ దిగ్గజానివి నువ్వే. జీవితంలోని నీ తర్వాతి దశను కూడా సరదాగా గడుపుతావని, ఆటను ఆస్వాదించినట్లుగానే ముందుకు సాగుతావని ఆశిస్తున్నా’’ అని అందులో కోహ్లి తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని