విజేతకు రూ.13 కోట్లు

ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచే జట్టు సుమారు రూ.13.02 కోట్లు (1.6 మిలియన్ల అమెరికా డాలర్లు) నగదు బహుమతిగా అందుకోనుంది. టోర్నీ నగదు బహుమతుల కింద దాదాపు రూ.45 కోట్లను కేటాయించినట్లు శుక్రవారం ఐసీసీ ప్రకటించింది.

Published : 01 Oct 2022 02:53 IST

దుబాయ్‌: ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచే జట్టు సుమారు రూ.13.02 కోట్లు (1.6 మిలియన్ల అమెరికా డాలర్లు) నగదు బహుమతిగా అందుకోనుంది. టోర్నీ నగదు బహుమతుల కింద దాదాపు రూ.45 కోట్లను కేటాయించినట్లు శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి నవంబర్‌ 13 వరకు జరిగే ఈ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు సుమారు రూ.6.51 కోట్లు ఖాతాలో వేసుకుంటుంది. 16 జట్లు పోటీపడే ఈ టోర్నీలో సెమీస్‌లో ఓడే రెండు జట్లు చెరో రూ.3.25 కోట్లతో నిష్క్రమిస్తాయి. సూపర్‌-12 దశ నుంచి ఇంటి ముఖం పట్టే ఎనిమిది జట్లు తలో రూ.56.98 లక్షలు దక్కించుకుంటాయి. ‘‘2021 పురుషుల టీ20 ప్రపంచకప్‌ లాగే ఈ సారి సూపర్‌-12 దశలో జరిగే 30 మ్యాచ్‌ల్లో ఒక్కో విజయానికి రూ.32 లక్షల చొప్పున జట్లు అందుకుంటాయి’’ అని ఐసీసీ వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు నేరుగా సూపర్‌-12 దశలో తలపడతాయి. మరో ఎనిమిది జట్లు.. నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్‌, యూఏఈ (గ్రూప్‌- ఎ), వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌ (గ్రూప్‌- బి) మిగిలిన నాలుగు స్థానాల కోసం తొలి రౌండ్లో పోటీపడతాయి. తొలి రౌండ్లో సాధించే ఒక్కో విజయానికి జట్టుకు రూ.32 లక్షలు సొంతమవుతాయి. తొలి రౌండ్‌ నుంచి నిష్క్రమించే నాలుగు జట్లు కూడా అంతే మొత్తంలో దక్కించుకుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని