జర్మనీ చేతిలో భారత్‌ ఓటమి

ప్రపంచ టీమ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు పోరాడి ఓడిపోయింది. శనివారం జరిగిన గ్రూప్‌-5 పోరులో భారత్‌ 2-3తో జర్మనీ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి సింగిల్స్‌లో మనిక బత్రా 3-11, 1-11, 2-11తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ యింగ్‌ హాన్‌ చేతిలో ఓడగా..

Published : 02 Oct 2022 02:30 IST

పపంచ టీమ్‌ టీటీ

చెంగ్డూ: ప్రపంచ టీమ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు పోరాడి ఓడిపోయింది. శనివారం జరిగిన గ్రూప్‌-5 పోరులో భారత్‌ 2-3తో జర్మనీ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి సింగిల్స్‌లో మనిక బత్రా 3-11, 1-11, 2-11తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ యింగ్‌ హాన్‌ చేతిలో ఓడగా.. రెండో సింగిల్స్‌లో శ్రీజ 11-9, 12-10, 11-7తో నీనాను ఓడించి స్కోర్లు సమం చేసింది. ఆ తర్వాత దివ్య 11-9, 8-11, 11-6, 13-11తో సబైన్‌ వింటర్‌పై గెలవడంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మనిక తడబడటం మన జట్టును ముంచింది. ఆమె 11-7, 6-11, 7-11, 8-11తో నీనా చేతిలో ఓడడంతో స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఆ తర్వాత మరో సింగిల్స్‌లో శ్రీజ 3-11, 5-11, 4-11తో తలొంచడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ప్రస్తుతం భారత్‌ (ఒక పాయింట్‌) నాలుగు జట్లు ఆడుతున్న గ్రూప్‌లో చివరి స్థానంలో ఉంది. మరోవైపు భారత పురుషుల జట్టు 3-0తో ఉజ్బెకిస్థాన్‌ను ఓడించి శుభారంభం చేసింది. తొలి సింగిల్స్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 11-9, 11-9, 11-1తో ఖోలికోవ్‌పై గెలవగా, సత్యన్‌ 11-3, 11-6, 11-9తో అనొర్‌బెర్‌ను ఓడించి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. మూడో సింగిల్స్‌లో మానవ్‌ థక్కర్‌ 11-8, 11-5, 11-5తో షోక్‌రుక్‌పై గెలిచి భారత్‌ విజయాన్ని సంపూర్ణం చేశాడు. ఈ విజయంతో గ్రూప్‌-2లో భారత్‌ (2 పాయింట్లు).. ఫ్రాన్స్‌ (4) తర్వాత రెండో స్థానంలో ఉంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts