వేచి చూస్తాం

ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రా గాయం కారణంగా ప్రపంచకప్‌నకు దాదాపుగా దూరమైనట్లే! కానీ బీసీసీఐ ఇంకా అధికారికంగా ధ్రువీకరించకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా కోచ్‌ ద్రవిడ్‌ ఈ విషయంపై స్పందించాడు.

Published : 02 Oct 2022 02:31 IST

బుమ్రా పరిస్థితిపై ద్రవిడ్‌

గువాహటి: ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రా గాయం కారణంగా ప్రపంచకప్‌నకు దాదాపుగా దూరమైనట్లే! కానీ బీసీసీఐ ఇంకా అధికారికంగా ధ్రువీకరించకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా కోచ్‌ ద్రవిడ్‌ ఈ విషయంపై స్పందించాడు. బుమ్రా వైద్య నివేదికల్లోకి తాను లోతుగా వెళ్లదలచుకోలేదని, అతడి పరిస్థితిపై బీసీసీఐ అధికారిక ధ్రువీకరణ కోసం వేచి చూస్తానని అన్నాడు. ‘‘మేం బీసీసీఐ నుంచి అధికారిక ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నాం. ప్రస్తుతానికైతే బుమ్రా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అధికారికంగా దూరమయ్యాడు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ద్రవిడ్‌ చెప్పాడు. ‘‘బుమ్రా వైద్య నివేదికల్లోకి లోతుగా వెళ్లలేదు. నిపుణుల నుంచి తెలుసుకుంటా. వాళ్లు ఈ సిరీస్‌లో అతడు ఆడలేడని చెప్పారు. అతడి పరిస్థితిని ఇంకా అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ముందు ముందు తెలుస్తుంది’’ అని అన్నాడు. ‘‘బుమ్రా ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండడని అధికారికంగా ధ్రువీకరించేంతవరకు మేం ఆశాభావంతోనే ఉంటాం. జట్టుకు, బుమ్రాకు ఎప్పుడూ మంచి జరుగుతుందనే ఆశిస్తాం’’ అని ద్రవిడ్‌ చెప్పాడు. ఆటలో గాయాలు సహజమని, గాయాలు లేని జట్టు ఉండదని అన్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న 15 మంది గత ఆరు నెలలో తగినంత క్రికెట్‌ ఆడారని ద్రవిడ్‌ చెప్పాడు. 28 ఏళ్ల బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కనీసం ఆరు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశముందని సమాచారం. బుమ్రా ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని