టైటిలే లక్ష్యంగా టైటాన్స్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఎనిమిది సీజన్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటి వరకూ తెలుగు టైటాన్స్‌ ఒక్క టైటిల్‌ కూడా గెలవలేకపోయింది. దాదాపు కొత్త ఆటగాళ్లతో.. సరికొత్త స్ఫూర్తితో తొమ్మిదో సీజన్‌లో టైటిల్‌ నిరీక్షణకు ముగింపు పలకాలనే లక్ష్యంతో జట్టు బరిలో దిగనుంది.

Published : 02 Oct 2022 02:32 IST

ఈ నెల 7 నుంచి పీకేఎల్‌ 9వ సీజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఎనిమిది సీజన్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటి వరకూ తెలుగు టైటాన్స్‌ ఒక్క టైటిల్‌ కూడా గెలవలేకపోయింది. దాదాపు కొత్త ఆటగాళ్లతో.. సరికొత్త స్ఫూర్తితో తొమ్మిదో సీజన్‌లో టైటిల్‌ నిరీక్షణకు ముగింపు పలకాలనే లక్ష్యంతో జట్టు బరిలో దిగనుంది. ఈ నెల 7న బెంగళూరులో ఆరంభమయ్యే ఈ సీజన్‌లో జట్టును అగ్రశ్రేణి డిఫెండర్‌ రవీందర్‌ పహాల్‌ నడిపిస్తాడు. శనివారం హైదరాబాద్‌లో టైటాన్స్‌ జట్టు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచి గత సీజన్‌ను అట్టడుగు స్థానంతో ముగించిన జట్టులో ఈ సారి చాలా మార్పులు జరిగాయి. అంకిత్‌, రజ్నీష్‌లను మాత్రమే అట్టిపెట్టుకున్న జట్టు.. గత ఆగస్టులో జరిగిన వేలంలో పర్వేష్‌, సుర్జీత్‌, విశాల్‌ భరద్వాజ్‌, రవిందర్‌ పహాల్‌ లాంటి కీలక డిఫెండర్లను సొంతం చేసుకుంది. సిద్ధార్థ్‌ దేశాయ్‌ను తిరిగి దక్కించుకున్న జట్టు.. మోను గోయత్‌, అమన్‌, అభిషేక్‌ సింగ్‌ లాంటి ఆటగాళ్లతో రైడింగ్‌ విభాగాన్ని పటిష్ఠం చేసుకుంది. ఇరాన్‌ ఆల్‌రౌండర్లు మోసెన్‌, హమిద్‌తో పాటు జట్టులో తెలుగు ఆటగాళ్లు రామకృష్ణ (ఏపీ), హనుమంతు (తెలంగాణ) కూడా ఉన్నారు. ప్రధాన కోచ్‌ వెంకటేష్‌ గౌడ్‌, సహాయక కోచ్‌ మంజీత్‌ చిల్లర్‌పైనా మంచి అంచనాలే ఉన్నాయి. సీజన్‌ తొలిరోజైన శుక్రవారం బెంగళూరు బుల్స్‌తో పోరుతో టైటాన్స్‌ టైటిల్‌ వేట మొదలెడుతుంది. ‘‘ఈ సీజన్‌లో జట్టు రాత మారుతుందనే నమ్మకంతో ఉన్నాం. కొత్త జట్టు, కోచింగ్‌ సిబ్బంది కలిసి కష్టపడుతున్నారు. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. కోచ్‌లు వెంకటేశ్‌, మంజీత్‌ కలిసి జట్టును టైటిల్‌ దిశగా నడిస్తారని ఆశిస్తున్నాం. ఈ సారి కప్పు గెలవడమే మా లక్ష్యం’’ అని టైటాన్స్‌ యజమానులు శ్రీనివాస్‌, గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

తెలుగు టైటాన్స్‌ జట్టు: రవీందర్‌ పహాల్‌ (కెప్టెన్‌), సిద్ధార్థ్‌ దేశాయ్‌, అంకిత్‌, మోను గోయత్‌, రజ్నీష్‌, అభిషేక్‌ సింగ్‌, వినయ్‌, సుర్జీత్‌ సింగ్‌, విశాల్‌ భరద్వాజ్‌, పర్వేష్‌, విజయ్‌ కుమార్‌, ఆదర్శ్‌, ప్రిన్స్‌, నితిన్‌, రవీందర్‌, మోహిత్‌, హనుమంతు, మహమ్మద్‌ సుహాస్‌, రామకృష్ణ, మోసెన్‌, హమిద్‌, అంకిత్‌, మోహిత్‌ పహాల్‌; రిజర్వ్‌: సుమిత్‌.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts