షెఫాలి ఫామ్‌ అందుకునేనా?

భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షెఫాలి వర్మ ఫామ్‌ అందుకునేందుకు మరో అవకాశం వచ్చింది. ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం జరిగే పోరులో మలేసియాతో భారత్‌ తలపడనుంది. స్పల్ప స్కోర్లకే ఔటవుతున్న షెఫాలి తేలికైన ప్రత్యర్థిపై ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం.

Published : 03 Oct 2022 02:10 IST

నేడు మలేసియాతో భారత్‌ పోరు
మధ్యాహ్నం 1 గంట నుంచి

సిల్‌హట్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షెఫాలి వర్మ ఫామ్‌ అందుకునేందుకు మరో అవకాశం వచ్చింది. ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం జరిగే పోరులో మలేసియాతో భారత్‌ తలపడనుంది. స్పల్ప స్కోర్లకే ఔటవుతున్న షెఫాలి తేలికైన ప్రత్యర్థిపై ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. 18 ఏళ్ల షెఫాలి.. గత మార్చి తర్వాత అర్థసెంచరీ చేయలేదు. కామన్వెల్త్‌ క్రీడల్లో ఒకటి రెండు మెరుపు ఆరంభాలు ఇచ్చినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయింది. ఇక ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఫుట్‌వర్క్‌ విషయంలో ఆమె మెరుగుపడాల్సి ఉంది. ఇక మిగిలిన బ్యాటర్లలో స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో శ్రీలంకతో భారత్‌ తొలి మ్యాచ్‌లో పునరాగమనం చేసిన జెమీమా రోడ్రిగ్స్‌ కూడా అర్థసెంచరీతో మెరిసింది. ప్రయోగాలు చేయాలనుకుంటే యువ కెరటం కిరణ్‌ నవ్‌గిరెకు తుది జట్టులో చోటు కల్పించే అవకాశాలున్నాయి. బౌలింగ్‌లో రేణుక సింగ్‌ జోరు మీద ఉంది. దీప్తిశర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌, రాధ యాదవ్‌ విజృంభిస్తే భారత్‌కు ఎదురుండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని