విజయానికి చేరువలో రెస్ట్‌

ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్‌ ఇండియా విజయానికి చేరువైంది. 276 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర మూడో రోజు, సోమవారం ఆట చివరికి 368/8తో నిలిచింది. ఆ జట్టు ప్రస్తుత ఆధిక్యం 92 పరుగులే. ఓవర్‌నైట్‌ స్కోరు 49/2తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర.. 87/5తో ఓటమి దిశగా సాగింది.

Updated : 04 Oct 2022 09:42 IST

సౌరాష్ట్ర 368/8

ఇరానీ ట్రోఫీ

రాజ్‌కోట్‌: ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్‌ ఇండియా విజయానికి చేరువైంది. 276 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర మూడో రోజు, సోమవారం ఆట చివరికి 368/8తో నిలిచింది. ఆ జట్టు ప్రస్తుత ఆధిక్యం 92 పరుగులే. ఓవర్‌నైట్‌ స్కోరు 49/2తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర.. 87/5తో ఓటమి దిశగా సాగింది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరు వెనుదిరిగిన సీనియర్‌ బ్యాటర్‌ చెతేశ్వర్‌ పుజారా (1) రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. షెల్డన్‌ జాక్సన్‌ (71; 117 బంతుల్లో 8×4, 3×6), అర్పిత్‌ వసవాడ (55; 127 బంతుల్లో 7×4, 1×6) అర్ధసెంచరీలతో జట్టు కుప్పకూలకుండా చూశారు. వీరి తర్వాత ప్రేరక్‌ మన్కడ్‌ (72; 83 బంతుల్లో 9×4), కెప్టెన్‌ జైదేవ్‌ ఉనద్కత్‌ (78; 116 బంతుల్లో 8×4, 2×6) పట్టుదల ప్రదర్శించడంతో సౌరాష్ట్ర స్కోరు 300 దాటింది. ఆట చివరికి ఉనద్కత్‌కు తోడుగా పార్థ్‌ (6) క్రీజులో ఉన్నాడు. ఎనిమిదో వికెట్‌కు ఉనద్కత్‌-ప్రేరక్‌ జోడీ 144 పరుగులు జోడించింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలగా.. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా 374 పరుగులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని