ప్రపంచ టేబుల్ టెన్నిస్ ప్రిక్వార్టర్స్‌లో భారత్
ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు ప్రిక్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన గ్రూపు మ్యాచ్‌లో భారత జట్టు 3-1తో ఈజిప్ట్‌పై నెగ్గి నాకౌట్‌కు చేరుకుంది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ సత్తాచాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
చెంగ్డు: ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు ప్రిక్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన గ్రూపు మ్యాచ్‌లో భారత జట్టు 3-1తో ఈజిప్ట్‌పై నెగ్గి నాకౌట్‌కు చేరుకుంది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ సత్తాచాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. 11-6, 11-4, 11-1తో గోదా హాన్‌పై, 11-8, 11-8, 9-11, 11-6తో దీనా మిష్రెఫ్పై శ్రీజ విజయాలు నమోదు చేసింది. మనిక బాత్రా 8-11, 11-6, 11-7, 2-11, 11-8తో దీనా మిష్రెఫ్పై గెలుపొందింది. గ్రూపు దశలో భారత పురుషుల జట్టు 3-2తో కజకిస్తాన్‌పై గెలిచి నాకౌట్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. సత్యన్ 11-1, 11-9, 11-5తో డెనిస్ జొలుదెవ్పై నెగ్గగా.. హర్మీత్ దేశాయ్ 6-11, 8-11, 9-11తో కిరిల్ చేతిలో ఓడాడు. మానవ్ ఠక్కర్ 12-10, 11-1, 11-8తో అలన్‌పై గెలిచి భారత్‌కు 2-1తో ఆధిక్యం అందించాడు. నాలుగో పోరులో సత్యన్ 11-6, 5-11, 14-12, 9-11, 6-11తో కిరిల్ చేతిలో ఓడాడు. నిర్ణయాత్మక అయిదో పోరులో హర్మీత్ 12-10, 11-9, 11-6తో జొలుదెవ్పై నెగ్గి 3-2తో భారత్‌కు విజయాన్ని అందించాడు. చివరి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై నెగ్గితే గ్రూపు-2లో భారత్ అగ్రస్థానం సాధిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!