మెరిసిన మేఘన

ఓపెనర్‌ సబ్బినేని మేఘన (69; 53 బంతుల్లో 11×4, 1×6) సత్తా చాటడంతో మహిళల ఆసియాకప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాను ఓడించింది.

Published : 04 Oct 2022 02:13 IST

మలేసియాపై భారత్‌ విజయం

మహిళల ఆసియా కప్‌

సిల్‌హట్‌: ఓపెనర్‌ సబ్బినేని మేఘన (69; 53 బంతుల్లో 11×4, 1×6) సత్తా చాటడంతో మహిళల ఆసియాకప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాను ఓడించింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు సాధించింది. మేఘన మెరుపులకు తోడు ఫామ్‌ అందుకున్న షెఫాలివర్మ (46; 39 బంతుల్లో 1×4, 3×6) కూడా రాణించడంతో భారత్‌కు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు మేఘన-షెఫాలి 116 పరుగులు జోడించారు. మేఘన, షెఫాలి ఔటైనా.. రిచా ఘోష్‌ (33 నాటౌట్‌; 19 బంతుల్లో 5×4, 1×6) ధాటిగా ఆడడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. ఛేదనలో వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి మలేసియా 5.2 ఓవర్లలో 16/2తో నిలిచింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం అప్పటికి మలేసియా 46 పరుగులు చేస్తే గెలిచేది. కానీ ఆ స్కోరుకు చాలా దూరంలో ఉండడంతో భారత్‌ విజయాన్ని అందుకుంది. టీమ్‌ఇండియా బౌలర్లలో దీప్తిశర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. హర్మన్‌ప్రీత్‌ బృందం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ గెలిచిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని