టాప్‌-10లోకి జెమీమా

భారత బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి ప్రవేశించింది. ఆసియాకప్‌తో పునరాగమనం చేసిన 22 ఏళ్ల జెమీమా.. ఈ టోర్నీలో ఇప్పటిదాకా రెండు అర్ధసెంచరీలు చేసి నాలుగు స్థానాలు మెరుగై ఎనిమిదో ర్యాంకులో నిలిచింది.

Published : 05 Oct 2022 02:52 IST

దుబాయ్‌: భారత బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి ప్రవేశించింది. ఆసియాకప్‌తో పునరాగమనం చేసిన 22 ఏళ్ల జెమీమా.. ఈ టోర్నీలో ఇప్పటిదాకా రెండు అర్ధసెంచరీలు చేసి నాలుగు స్థానాలు మెరుగై ఎనిమిదో ర్యాంకులో నిలిచింది. జెమీమా.. టాప్‌-10లో ఉన్న మూడో భారత బ్యాటర్‌. స్మృతి మంధాన మూడో ర్యాంకులో ఉండగా.. షెఫాలివర్మ ఏడో స్థానంలో కొనసాగుతోంది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 13వ ర్యాంకులో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్‌ బెత్‌ మూనీ అగ్రస్థానం సాధించింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ ఏడో ర్యాంకులో ఉండగా.. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకీల్‌స్టోన్‌ నంబర్‌వన్‌ ర్యాంకులో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని