విమానం ఎక్కలేదు.. చోటు పోయింది
స్టార్ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మయర్‌పై వేటుపడింది. వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి అతడిని తొలగించారు. సోమవారం ఆస్ట్రేలియాకు పయనమవ్వాల్సి ఉండగా.. విమానాన్ని అందుకోలేకపోయిన హెట్మయర్ను సెలెక్టర్లు పక్కన పెట్టారు.
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా): స్టార్ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మయర్‌పై వేటుపడింది. వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి అతడిని తొలగించారు. సోమవారం ఆస్ట్రేలియాకు పయనమవ్వాల్సి ఉండగా.. విమానాన్ని అందుకోలేకపోయిన హెట్మయర్ను సెలెక్టర్లు పక్కన పెట్టారు. అతడి స్థానంలో షమర్ బ్రూక్స్‌ను ఎంపిక చేశారు. నిజానికి శనివారమే హెట్మయర్ ఆసీస్‌కు వెళ్లాల్సింది. కుటుంబ కారణాల వల్ల అతనికి సోమవారం వరకు అనుమతిచ్చారు. గోల్డ్‌కోస్ట్‌లో బుధవారం ఆసీస్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌కు అతను అ ందుబాటులో ఉంటాడని భావించారు. అయితే రీషెడ్యూల్ చేసిన విమానాన్ని తాను అందుకోలేకపోతున్నట్లు సోమవారం విండీస్ బోర్డుకు హెట్మయర్ సమాచారం అందించాడు. ‘‘కుటుంబ కారణాలతో శనివారం నాటి విమానాన్ని సోమవారానికి మార్చుకున్నప్పుడే హెట్‌మయర్‌కు స్పష్టంగా చెప్పాం. ప్రయాణంలో ఆలస్యం, ఇబ్బందులు ఉంటే అతని స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం మినహా మార్గం లేదని తెలిపాం. ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో జట్టు సామర్థ్యంపై రాజీపడేందుకు సిద్ధంగా లేము’’ అని విండీస్ క్రికెట్ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM