భారత్‌ హ్యాట్రిక్‌

మహిళల ఆసియాకప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. మంగళవారం హర్మన్‌ప్రీత్‌ బృందం 104 పరుగుల భారీ తేడాతో యూఏఈని చిత్తు చేసింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు సాధించింది.

Published : 05 Oct 2022 02:56 IST

యూఏఈపై ఘన విజయం
రాణించిన జెమీమా, దీప్తి
మహిళల ఆసియాకప్‌

సిల్‌హట్‌: మహిళల ఆసియాకప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. మంగళవారం హర్మన్‌ప్రీత్‌ బృందం 104 పరుగుల భారీ తేడాతో యూఏఈని చిత్తు చేసింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (75; 45 బంతుల్లో 11×4), దీప్తిశర్మ (64; 49 బంతుల్లో 5×4, 2×6) సత్తా చాటారు. శ్రీలంకతో మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన జెమీమా.. మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో దీప్తితో కలిసి జట్టును ఆదుకుంది. జెమీమా-దీప్తి నాలుగో వికెట్‌కు 128 పరుగులు జత చేసి భారత్‌కు మెరుగైన స్కోరు సాధించి పెట్టారు. ఛేదనలో భారత బౌలర్ల ధాటికి యూఏఈ బ్యాటర్లు తేలిపోయారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆ  జట్టు.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులే చేసి ఓటమి చవిచూసింది. కవిషా (54 బంతుల్లో 30 నాటౌట్‌), ఖుషి (50 బంతుల్లో 29) రాణించినా వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్‌ 2 వికెట్లు తీయగా.. హేమలత ఒక వికెట్‌ పడగొట్టింది. ఈ టోర్నీలో హ్యాట్రిక్‌ విజయాలతో టీమ్‌ఇండియా (6 పాయింట్లు) పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని