Mankading: దీపక్‌.. దీప్తిలా చేయబోయి..

భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బౌలింగ్‌ చేయబోతూ ఆగి ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను రనౌట్‌ (మన్కడింగ్‌) చేసిన ఉదంతం తాలూకు వేడి ఇంకా చల్లారక ముందే భారత్‌-దక్షిణాఫ్రికా మూడో టీ20లో అలాంటి ఘటన కొద్దిలో తప్పింది.

Updated : 05 Oct 2022 10:37 IST

భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బౌలింగ్‌ చేయబోతూ ఆగి ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను రనౌట్‌ (మన్కడింగ్‌) చేసిన ఉదంతం తాలూకు వేడి ఇంకా చల్లారక ముందే భారత్‌-దక్షిణాఫ్రికా మూడో టీ20లో అలాంటి ఘటన కొద్దిలో తప్పింది. సఫారీ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ బౌలింగ్‌ చేయడానికి వచ్చిన పేసర్‌ దీపక్‌ చాహర్‌..   నాన్‌స్ట్రైకర్‌ స్టబ్స్‌ను రనౌట్‌ చేయబోయి ఆగిపోయాడు. ఈ ఓవర్లో తొలి బంతి వేయబోతుండగా.. స్టబ్స్‌ క్రీజు దాటేశాడు. ఇది గమనించిన దీపక్‌ బౌలింగ్‌ ఆపేసి బంతితో వికెట్లను కొట్టబోయి ఆగాడు. హెచ్చరిస్తున్నట్లుగా స్టబ్స్‌ను చూసి, ఆపై నవ్వేసి మళ్లీ బౌలింగ్‌ కొనసాగించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతోంది. స్టబ్స్‌ను హెచ్చరించి వదిలేసి చాహర్‌ మరోసారి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడని.. ఇటీవల జింబాబ్వేతో మ్యాచ్‌లో ఇన్నోసెంట్‌ కయాను రనౌట్‌ చేసినా అతడు అప్పీల్‌ చేయలేదని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని