విజేత ఇండియా క్యాపిటల్స్‌

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్లో గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలోని ఇండియా క్యాపిటల్స్‌ విజేతగా నిలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాస్‌ టేలర్‌ (82; 41 బంతుల్లో 4×4, 8×6), మిచెల్‌ జాన్సన్‌ (62; 35 బంతుల్లో 7×4, 3×6), ఆష్లే నర్స్‌ (42 నాటౌట్‌; 19 బంతుల్లో 6×4, 1×6) చెలరేగడంతో బిల్వారా కింగ్స్‌ను

Published : 07 Oct 2022 03:02 IST

మెరిసిన టేలర్‌, జాన్సన్‌, నర్స్‌

 లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌

జైపుర్‌: లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్లో గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలోని ఇండియా క్యాపిటల్స్‌ విజేతగా నిలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాస్‌ టేలర్‌ (82; 41 బంతుల్లో 4×4, 8×6), మిచెల్‌ జాన్సన్‌ (62; 35 బంతుల్లో 7×4, 3×6), ఆష్లే నర్స్‌ (42 నాటౌట్‌; 19 బంతుల్లో 6×4, 1×6) చెలరేగడంతో బిల్వారా కింగ్స్‌ను 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్‌ చిత్తు చేసింది. మొదట గంభీర్‌ సేన 20 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగుల భారీస్కోరు సాధించింది. 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న జట్టుకు భారీస్కోరు అందించిన ఘనత టేలర్‌, జాన్సన్‌, నర్స్‌లదే. టేలర్‌, జాన్సన్‌ అయిదో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. బిల్వారా బౌలర్లలో రాహుల్‌శర్మ (4/30), మాంటీ పనేసర్‌ (2/13), టిమ్‌ బ్రెస్నన్‌ (1/11) సఫలమయ్యారు. అనంతరం బిల్వారా కింగ్స్‌ 18.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో షేన్‌ వాట్సన్‌ (27; 19 బంతుల్లో 3×4, 1×6) అత్యధిక స్కోరర్‌. క్యాపిటల్స్‌ బౌలర్లలో జాన్సన్‌ (1/26), పవన్‌ సుయాల్‌ (2/27), ప్రవీణ్‌ తంబె (2/19), ప్లంకెట్‌ (1/15), పంకజ్‌సింగ్‌ (2/14), రజత్‌ భాటియా (1/2) రాణించారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని