టీ20లో కార్న్‌వాల్‌ 205

టెస్టుల్లో ఓ బ్యాటర్‌ 200 స్కోరు నమోదు చేయడం మామూలే. వన్డేల్లో ద్విశతకం అందుకోవడం కష్టం. ఇక టీ20ల్లో అయితే అసాధ్యమనే చెప్పాలి. కానీ వెస్టిండీస్‌ భారీకాయుడు రకీం కార్న్‌వాల్‌ ఆ ఘనత సొంతం చేసుకున్నాడు.

Published : 07 Oct 2022 03:02 IST

దిల్లీ: టెస్టుల్లో ఓ బ్యాటర్‌ 200 స్కోరు నమోదు చేయడం మామూలే. వన్డేల్లో ద్విశతకం అందుకోవడం కష్టం. ఇక టీ20ల్లో అయితే అసాధ్యమనే చెప్పాలి. కానీ వెస్టిండీస్‌ భారీకాయుడు రకీం కార్న్‌వాల్‌ ఆ ఘనత సొంతం చేసుకున్నాడు. ఓ టీ20 మ్యాచ్‌లో అజేయంగా 205 పరుగులు సాధించాడు. అమెరికాలోని అట్లాంటా ఓపెన్‌ టీ20 లీగ్‌లో వీరవిధ్వంసం సృష్టించాడు. స్క్వేర్‌డ్రైవ్‌ జట్టుతో మ్యాచ్‌లో అట్లాంటా ఫైర్‌ తరపున కేవలం 77 బంతుల్లోనే 205 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చిన్న బౌండరీలతో కూడిన మైదానంలో బంతిని చితక్కొట్టి 17 ఫోర్లు, 22 సిక్సర్లు రాబట్టాడు. అతని డబుల్‌ సెంచరీ సాయంతో అట్లాంటా ఫైర్‌ 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 326 పరుగులు చేసింది. ఛేదనలో ప్రత్యర్థిని 154/8కే పరిమితం చేసిన ఆ జట్టు 172 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 మ్యాచ్‌లో రకీం సాధించిన ఈ ద్విశతకానికి రికార్డు పుస్తకాల్లో చోటు దక్కదు. ఈ లీగ్‌కు ఎలాంటి గుర్తింపు లేకపోవడమే అందుకు కారణం. ఇటీ20 మ్యాచ్‌లో అత్యధిక స్కోరు రికార్డు క్రిస్‌ గేల్‌ (2013 ఐపీఎల్‌లో పుణెపై 175 నాటౌట్‌) పేరిట ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు