కొత్త ఛాంపియన్లకు అవకాశం

టీ20 ప్రపంచకప్‌లో పేసర్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాల గైర్హాజరీ టీమ్‌ఇండియాపై ప్రభావం చూపుతుందని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

Published : 08 Oct 2022 01:46 IST

బుమ్రా, జడేజాల గైర్హాజరీపై రవిశాస్త్రి

చెన్నై: టీ20 ప్రపంచకప్‌లో పేసర్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాల గైర్హాజరీ టీమ్‌ఇండియాపై ప్రభావం చూపుతుందని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే కొత్త ఛాంపియన్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవకాశాన్ని కూడా కల్పిస్తుందని తెలిపాడు. ‘‘బుమ్రా, జడేజాలు అక్కడ లేకపోవడం జట్టుకు నష్టం చేసేదే. అయితే కొత్త ఛాంపియన్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఇదో అవకాశం. బుమ్రాకు గాయమవడం దురదృష్టకరం. ఆటగాళ్లు చాలా క్రికెట్‌ ఆడుతున్నారు. గాయాల పాలవుతున్నారు. అతనూ గాయపడ్డాడు. కాని మరొకరికి ఇది అవకాశం. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో బుమ్రా స్థానంలో పేసర్‌ మహ్మద్‌ షమి అనుభవం జట్టుకు పనికొస్తుంది. గత ఆరేళ్లలో ఆసీస్‌కు టీమ్‌ఇండియా చాలాసార్లు వెళ్లింది. అన్ని పర్యటనల్లో షమి ఉన్నాడు. అతని అనుభవం పనికొస్తుంది’’ రవిశాస్త్రి వివరించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts