రెండోసారి.. ప్రపంచ టైటిల్‌పై గురి

వరుసగా రెండో ఏడాదీ ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే దిశగా రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ దూసుకెళ్తున్నాడు. ఎఫ్‌1 ప్రపంచ టైటిల్‌కు ఈ 25 ఏళ్ల నెదర్లాండ్స్‌ రేసర్‌ చేరువయ్యాడు.

Published : 08 Oct 2022 01:46 IST

ఎఫ్‌1 ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ ముంగిట వెర్‌స్టాపెన్‌

సుజుకా: వరుసగా రెండో ఏడాదీ ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే దిశగా రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ దూసుకెళ్తున్నాడు. ఎఫ్‌1 ప్రపంచ టైటిల్‌కు ఈ 25 ఏళ్ల నెదర్లాండ్స్‌ రేసర్‌ చేరువయ్యాడు. ఆదివారం జపనీస్‌ గ్రాండ్‌ ప్రి రేసులో గెలవడంతో పాటు వేగవంతమైన ల్యాప్‌ టైమింగ్‌ నమోదు చేసి ఓ బోనస్‌ పాయింట్‌ కూడా నెగ్గితే అతనే 2022 ఛాంపియన్‌. ఊహాగానాలకు తావులేకుండా, లెక్కలతో సంబంధం లేకుండా మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే టైటిల్‌ సాధిస్తాడు. ప్రస్తుతం ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అతను 341 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న లెక్లెర్క్‌ (237), పెరెజ్‌ (235)కు వెర్‌స్టాపెన్‌కు మధ్య భారీ తేడా ఉంది. ఈ నేపథ్యంలో జపనీస్‌ గ్రాండ్‌ ప్రిలో వెర్‌స్టాపెన్‌ నెగ్గితే మరోసారి ప్రపంచ టైటిల్‌ అతని ఖాతాలోనే చేరే అవకాశం ఉంది. లేదంటే రెండు వారాల తర్వాత జరిగే యుఎస్‌ గ్రాండ్‌ ప్రి వరకు ఆగాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో 17 రేసుల్లో అతను 11 విజయాలు సాధించాడు. ‘‘జపనీస్‌ గ్రాండ్‌ ప్రి రేసుతోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిస్తే బాగుంటుంది. ఒకవేళ అలా జరగకపోతే తర్వాతి రేసులో దీన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తా. నిజానికి టైటిల్‌ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు’’ అని వెర్‌స్టాపెన్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts