Urvashi Rautela: పంత్‌ వెంట పడతావెందుకు?

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమె ఓ సైకో అని పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. టీ20 ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా చేరుకుంది. మరోవైపు ఊర్వశి కూడా ఆస్ట్రేలియా వెళ్తున్నానని విమానంలో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

Updated : 11 Oct 2022 08:35 IST

ఊర్వశికి నెటిజన్ల చురకలు

దిల్లీ: బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమె ఓ సైకో అని పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. టీ20 ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా చేరుకుంది. మరోవైపు ఊర్వశి కూడా ఆస్ట్రేలియా వెళ్తున్నానని విమానంలో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. పైగా దీనికి ‘‘నా హృదయాన్ని అనుసరిస్తున్నా. అది నన్ను ఆస్ట్రేలియాకు నడిపించింది’’ అనే వ్యాఖ్య జోడించింది. ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో టీమ్‌ఇండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌, ఊర్వశి ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలను పంత్‌ ఖండించాడు. ‘ఆర్‌.పి’ అనే వ్యక్తి తనను కలిసేందుకు దిల్లీ హోటల్లో రాత్రి ఎదురు చూశాడని, కానీ తనకు కుదరలేదని పంత్‌ను ఉద్దేశిస్తూ ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రజాదరణ, వార్తల్లో నిలవడం కోసం కొంతమంది ఇలా ప్రవర్తిస్తారని పంత్‌ ఘాటుగానే స్పందించాడు. ‘‘సోదరీ.. నన్ను ఒంటరిగా వదిలేయ్‌’’ అని కూడా పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆసియా కప్‌ కోసం ఆమె యూఏఈ వెళ్లింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకూ చేరుకోవడంతో పంత్‌ను ఆమె వేధిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాగే ఓ మహిళా క్రికెటర్‌ పట్ల పురుషుడు వ్యవహరిస్తే ఎలా ఉండేదని ప్రశ్నిస్తున్నారు. ఊర్వశితో పంత్‌ ఇలా వ్యవహరించి ఉంటే జైల్లో ఉండేవాడని పేర్కొంటున్నారు. ఈ విమర్శలను పట్టించుకోని ఊర్వశి మాత్రం.. ‘‘అతణ్ని ఎలా మర్చిపోగలను? మరణం మనిషికి వస్తుంది. జ్ఞాపకాలకు కాదు’’ అంటూ ఆకుపచ్చని లెహెంగాలో మెరిసిపోతున్న మరో ఫొటోను పోస్టు చేసింది. ‘‘ఊర్వశి ఓ సైకో. ఆమె చేసేది ఏ మాత్రం సరదా కాదు. ప్రచారం కోసం ఓ నిబద్ధత ఉన్న వ్యక్తిని వెంబడించడం గగుర్పాటు కలిగిస్తోంది. అమ్మాయిలు తిరస్కరణను తట్టుకోలేరని ఆమె చాటుతోంది. స్మృతి మంధాన విషయంలో ఇలా ఓ పురుషుడు చేసి ఉంటే స్త్రీవాద మాఫియాకు నిద్ర ఉండేదే కాదు’’ అని ఒక నెటిజన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని