Sourav Ganguly: మళ్లీ క్యాబ్‌ అధ్యక్షుడిగా దాదా!

బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరభ్‌ గంగూలీ తిరిగి బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. క్యాబ్‌ ఎన్నికల్లో పోటీపడతానని ప్రకటించాడు. గతంలో 2015 నుంచి 2019 వరకు అతను క్యాబ్‌ అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే.

Updated : 16 Oct 2022 08:48 IST

దిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరభ్‌ గంగూలీ తిరిగి బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. క్యాబ్‌ ఎన్నికల్లో పోటీపడతానని ప్రకటించాడు. గతంలో 2015 నుంచి 2019 వరకు అతను క్యాబ్‌ అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. ‘‘అవును.. క్యాబ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తా. ఈ నెల 22న నామినేషన్‌ దాఖలు చేయాలనుకుంటున్నా. అయిదేళ్లు క్యాబ్‌లో ఉన్నా. లోధా కమిటీ నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు పదవిలో ఉండే అవకాశం ఉంది. ఈ నెల 20న నా ప్యానెల్‌ను ఖరారు చేస్తా. చూద్దాం ఏమవుతుందో’’ అని గంగూలీ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని